పవన్ కు ముద్రగడ లేఖ: అండీ.. అండీ.. అంటూనే గట్టిగా..!

తాజాగా సర్పవరం జంక్షన్ లో జనసేన నిర్వహించిన సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ శృతితో పాటు గతి కూడా తప్పారని ఫలితంగా మతి తప్పినట్లుగా వ్యాఖ్యానించారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా “కాపు నాయకులు” అంటూ ముద్రగడ పద్మనాభం పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై సొంత సామాజికవర్గంలో వస్తున్న విపరీతమైన వ్యతిరేకత సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా ఈ విషయాల పై ముద్రగడ తనదైన రీతిలో స్పందించారు.

“రాష్ట్రంలో పరిచయం అక్కరలేని పేరు… కాపుల ప్రయోజనాలే ఆయన తీరు” అన్నట్లుగా నడుచుకుంటున్న ముద్రగడ పద్మనాభం పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో… “నలభయ్యేళ్ళ క్రిందట ఎప్పుడో మంత్రిగా పనిచేసి.. నాటి నుంచి నేటి వరకూ ఏ రాజకీయ పదవీ చేపట్టకుండా.. కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడే ఉద్యమాల్లో నే జీవిస్తున్న నిస్వార్ధపరుడి పై.. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మతిభ్రమించిన చర్య”గా అభివర్ణిస్తున్నారు ఆ సామాజికవర్గం జనాలు!

ఈ సందర్భం గా పవన్ తన పై చేసిన వ్యాఖ్యల పై ముద్రగడ కూడా స్పందించారు. పవన్ అజ్ఞానాన్ని వెక్కిరిస్తూ వివేకాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఒక లేఖాస్త్రాన్ని సందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు గట్టి క్లాస్ పీకారు. అండి.. అండి.. అంటూ గోదావరి జిల్లా గౌరవాన్ని చూపిస్తూనే.. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు.. అడగాలనుకున్న ప్రశ్నలు అడిగేశారు.. కడగాలనుకున్న రీతిలో కడిగేశారు. వితౌట్ గ్యాప్ స్మూత్ గా దింపేశారు!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ చంద్రబాబు మైకంలో ఉన్నారంటూ వస్తున్న కామెంట్లకు తగ్గట్లుగా… తానూ ఏనాడూ ఉద్యమాన్ని అమ్ముకోలేదు అంటూనే… కాపు ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా ఫిక్సయిన పవన్ కు గట్టి మొట్టికాయలు వేశారు! మాట తీరు మార్చుకోండి.. ఇది న్యాయమాండి.. ఇది పద్దతి కాదండి.. ఇది ఎలా సరైన చర్య అండి.. అంటూనే… “వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి” అని ఘాటు ప్రశ్నలు సంధించారు.

ఇక మైకట్టుకుంటే చాలు బట్టలు ఊడదీస్తా.. కింద కుర్చోబెడతా.. తాట తీస్తా.. గుండు గీయిస్తా వంటి వ్యాఖ్యలు చేస్తున్న సరికొత్త రాజకీయ నాయకుడు పవన్ ను… “మీరు ఇంతవరకూ ఎంతమందికి చెప్పుతో కొట్టారు ఎన్ని తొక్కలు తీశారు ఎన్ని గుండ్లు గీయించారు” అంటూ ర్యాగింగ్ చేసారు. ఫలితంగా ఒకప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన “గుండు” అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు ముద్రగడ.

రాజకీయాల్లోనే కాదు జీవితంలో కూడా తాను ఏనాడు ఓటమి ఎరుగను అని అంటూనే… పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోరనే విషయాన్ని గుర్తుచేస్తూ… పవన్ కు మానసికంగా కుల్లబొడిచేశారు ముద్రగడ. ఫలితంగా.. చప్పుడు రాకుండా చితక్కొట్టడాన్ని అక్షరాల రూపంలో ఆవిష్కరించినంత పనిచేశారు.

ఇదే సమయంలో తానూ ఇన్నేళ్ళుగా కాపుల ప్రయోజనాలు కాపు యువతకు రిజర్వేషన్ల కోసం మాత్రమే పని చేశాను తప్ప ఏనాడూ ఇతరుల పల్లకి మోయలేదంటూ.. ఏనాడూ సూట్ కేసులకు అమ్ముడు పోలేదని చెబుతూ.. “ప్యాకేజీ స్టార్” అనే నానుడిని మరోసారి తెరపైకి తెచ్చినంతపని చేశారు. అదేవిధంగా… తాను ఏనాడూ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపు కోలేదని తానూ అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. కులం ప్రయోజనాల కోసమే పోరాడుతూ ఉన్నానని పోరాడుతూనే ఉంటానని తెలిపారు.

ఈ సందర్భంగా తనకు భారీ ఆఫర్ ప్రకటించినా కూడా… కాపు నాయకులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సైతం పట్టుబడిన వ్యక్తి తాను అని ముద్రగడ గుర్తుచేశారు. ఈ సందర్భంగా… రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి సమస్యల మీద పోరాడాలని సూచించారు ముద్రగడ. దీంతో… పవన్ కల్యాణ్ కులాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికి తప్ప ప్రజా పోరాటాలకు పనికిరారనే విషయాన్ని గుర్తుచేస్తూ దెప్పి పొడిచారని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో సుతా మొదలూ తెలుసుకోకుండా.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్ల అవమానకరంగా మాట్లాడిన విషయాలపై కూడా ఈ లేఖలో పద్మనాభం ఫైరయ్యారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజాజీవనంలో ఉందని గుర్తు చేసిన ఆయన… కాపు ఉద్యమానికి నిత్యం వారితోబాటు వారి తండ్రి తాతయ్య సైతం వెన్నుదన్నుగా నిలిచారని.. అవసరమైన ప్రతిసారీ వాహన వనరులను సమకూర్చారని తెలిపారు.

ఇదే సమయంలో పొంతనలేకుండా మాట్లాడుతూ.. తనకు సీఎం అయ్యేటంత సీన్ లేదని నిన్నటివరకూ చెబుతూ.. తాజాగా “నన్ను ముఖ్యమంత్రిని చేయండి” అని నరంలేని నాలుకను ఫుల్ గా వాడేస్తున్న పవన్ అని పరోక్షంగా గుర్తుచేస్తూ… 175 స్థానాలకూ పోటీచేసినప్పుడు మాత్రమే “నన్ను ముఖ్యమంత్రిని చేయండి” అనే పదం వాడాలి అని వెక్కిరించారు.. ఫలితంగా పవన్ కు 175 స్థానాల్లోనూ పోటీచేసేటంత సీన్ లేదని గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

ఇలా “తన అనుభవాన్ని తన సహనాన్ని తన ధైర్యాన్ని తన విషయ పరిజ్ఞానాన్ని జాతిపై తనకున్న నిబద్ధతని మేళవిస్తూ… పవన్ ను ఘాటుగా ప్రశ్నిస్తూ సున్నితంగా సూచిస్తూ మర్యాదగా వాయిస్తూ ఫైనల్ గా ఉతిరి ఆరేశారు” ముద్రగడ పద్మనాభం.

మరి ఈ వాయింపు నుంచి తేరుకున్న అనంతరం పవన్ మరోసభలో మళ్లీ ముద్రగడ పై స్పందిస్తారా.. లేక తప్పు తెలుసుకుని కాం అయిపోతారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… ముద్రగడ పద్మనాభం పై కూడా చంద్రబాబు కోసం పవన్ విషం కక్కడం క్షమించరాని నేరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

https://www.facebook.com/v2.10/plugins/page.php?adapt_container_width=true&app_id=184607281565521&channel=https%3A%2F%2Fstaticxx.facebook.com%2Fx%2Fconnect%2Fxd_arbiter%2F%3Fversion%3D46%23cb%3Dfee6a934a32778%26domain%3Dwww.tupaki.com%26is_canvas%3Dfalse%26origin%3Dhttps%253A%252F%252Fwww.tupaki.com%252Ff222d9530aeb058%26relation%3Dparent.parent&container_width=665&height=140&hide_cover=false&href=https%3A%2F%2Fbusiness.facebook.com%2FTupakidotcom%2F&locale=en_US&sdk=joey&show_facepile=true&small_header=false&tabs=timeline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these