జగన్ హెల్ప్ బీజేపీకి గట్టిగా పడుతోందా…?

ఏపీకి వచ్చి జగన్ ది అవినీతి ప్రభుత్వం అని ఒకటికి పదిసార్లు బీజేపీ పెద్దలు చెప్పి వెళ్లారు. జేపీ నడ్డా అమిత్ షా వంటి బీజేపీ దిగ్గజాలు ఏపీలో వైసీపీ అక్రమాల పుట్ట అని శాపనార్ధాలు పెట్టారు. ఏపీలో అన్ని విధాలుగా అరాచకమే అని బిగ్ సౌండ్ చేశారు.


దాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ సహా విపక్షాలు అన్నీ కూడా వైసీపీని కార్నర్ చేస్తూ వచ్చాయి. ఇదిలా ఉంటే కేంద్రంలో తొమ్మిది నెలల వరకూ అధికారం బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ అజెండాలోని కొన్ని కీలక అంశాలు ఇపుడు తెర ముందుకు వస్తున్నాయి. వాటిని చట్టబద్ధం చేసి తాము అధికారంలో ఉన్నందుకు అనుకున్నది పూర్తి చేయాలన్నది బీజేపీ పట్టుదల.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం బీజేపీ హయాంలో జరుగుతోంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి భారత్ లో పూర్తిగా అంతర్భాగం చేశారు. ఇపుడు ఇంకో కీలకమైన అంశం బీజేపీ ప్రభుత్వం చేయాల్సి ఉంది అంటున్నారు. అదే ఉమ్మడి పౌర స్మృతి అని చెబుతున్నారు.

దీనిని వచ్చే వర్షాకాల సమావేశాంలో చట్టంగా చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. కామన్ సివిల్ కోడ్ అన్నది బీజేపీ దశాబ్దాలుగా తన నినాదంగా చేసుకుంటూ వస్తోంది. ఈ దేశంలో ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే విధానం అని బీజేపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ కామన్ సివిల్ కోడ్ బిల్లుని ఈ ఏడాదిలోనే  ప్రవేశపెట్టవచ్చు అని అంటున్నారు. దీంతో పాటు చాలా బిల్లులు కూడా ఉంటాయని చెబుతున్నారు. జనాభా నియంత్రణ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది  అని అంటున్నారు. ఈ బిల్లు ప్రకారం ఎవరికైనా ఒకరు లేదా ఇద్దరు కంటే పిల్లలు ఉండకూడదు అని పేర్కొంటారు.

అయితే లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ అయితే లేదు. ఆ సంఖ్య బాగా తగ్గింది. అదే టైంలో విపక్షాల బలం పెరిగింది. దాంతో బీజేపీకి రాజ్యసభలో కామన్ సివిల్ కోడ్ సహా అనేక కీలక బిల్లుకు రెండు సభలలో ఆమోదం పొందాలీ అంటే కచ్చితంగా వైసీపీకి ఉన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these