అలీకి జగన్ బంపర్ ఆఫర్..

ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న బలమైన ఆకాంక్ష అలీలో ఎప్పటి నుంచో ఉంది. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. అందుకే గత ఎన్నికల్లో టిడిపి నుంచి వైసీపీలో చేరారు. కానీ అప్పటికే వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో అలీ ఎన్నికల ప్రచారానికి పరిమితం కావాల్సి వచ్చింది. వైసిపి అధికారంలోకి రావడంతో అలీని జగన్ ప్రయారిటీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి ఇచ్చారు. ఆ పదవిలో కొనసాగుతున్న అలీ వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో అలీకి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.

అలీ సొంత నియోజకవర్గం రాజమండ్రి. అక్కడ కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలీ. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆలీ ఆకాంక్ష. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా రాజమండ్రి ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో అలీ సైతం పునరాలోచనలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు అనుకూలమైన అసెంబ్లీ నియోజకవర్గాలపై తొలుత దృష్టి పెట్టారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వైసీపీలో సీనియర్లు ఉన్నారు. దీంతో ఎక్కడైనా ఎంపీగా పోటీ చేస్తే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు వైసీపీ 9 జాబితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 80 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చారు. త్వరలో కొద్దిపాటి మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే అలీకి సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కర్నూలు లేదా నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అలీకి సూచించినట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు అధికం. వైసీపీకి పట్టు ఉండడం, అలీ సెలబ్రిటీ కావడంతో తప్పకుండా విజయం సాధిస్తారని హై కమాండ్ కు నివేదికలు అందాయి. అందుకే జగన్ ప్రత్యేకంగా అలీని పిలిచి ఈ విషయం చెప్పినట్లు సమాచారం. అయితే అలీ కర్నూలు కంటే నంద్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసిపి తర్వాత ప్రకటించే జాబితాలో అలీ పేరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అలీకి బంపర్ ఆఫర్ తగిలినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these