టీడీపీతో పొత్తు విఫల ప్రయోగమే – జోగయ్య సంచలనం..!!

టీడీపీ, జనసేన పొత్తు పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. తాజాగా టీడీపీ పొత్తు ధర్మం పాటించటం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి కొనసాగింపుగా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సమయంలోనే మాజీ ఎంపీ హరి రామ జోగయ్య రాసిన సంచలనంగా మారుతోంది. కనీసం 50 సీట్లు అయినా జనసేనకు కేటాయించకపోతే టీడీపీ పొత్తు విఫల ప్రయోగంగా మారే అవకాశం ఉందని హరిరామ జోగయ్య హెచ్చరించారు.

జోగయ్య కీలక వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించిన హరి రామ జోగయ్య కీలక అంశాలతో లేఖ విడుదల చేసారు. జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ పెద్ద మనసుతో సర్దుకపోవటమే కారణమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన 137 సీట్లలో ఒంటరిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు తక్కవ సీట్లు కేటాయిస్తా రనే ప్రచారంతో పవన్ అభిమానులు, జనసైనికులు నిరాశ చెందుతున్నారని చెప్పుకొచ్చారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబుకు జనసేన సీట్లలో తమ అభ్యర్దులకు అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తున్నట్లు తేట తెల్లమవుతోందని పేర్కొన్నారు.

50 స్థానాలు ఇవ్వాలి జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేసి..తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకపోలేదన్నారు. జనసేనకు గౌరవ ప్రదమైన సీట్లు ఇవ్వటం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే పవన్ మౌనం వహించినా కేడర్ టీడీపీ పోటీ చేసే స్థానాల్లో వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదాన్ని కాదనలేమని పేర్కొన్నారు. జనసేన కు గౌరవ ప్రదమైన సీట్లు కేటాయింపు ద్వారానే ఆ పార్టీ ఓట్ బ్యాంక్ బదిలీ అవుతుందని టీడీపీ నేతలు గుర్తించాలని సూచించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ టీడీపీ ఏకపక్షంగా సీట్లను ప్రకటించటం తప్పేనని చెప్పారు. రాజోలు, రాజానగరం తో పాటుగా పశ్చిమ గోదావరిలోని పార్టీకి బలమున్న నియోజకవర్గాలను ప్రకటించి ఉండాల్సిందని జోగయ్య అభిప్రాయ పడ్డారు.

విఫల ప్రయోగం కాకుండా జనసేనకు 25-30 సీట్లు కేటాయిస్తే పవన్ ఇప్పటి వరకు చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుందని వివరించారు. పవన్ కు సీట్లు, అధికారంలో కాలనీ గౌరవమైన వాటా ఇవ్వకుంటే పవన్ పొత్తు విఫల ప్రయోగంగా మారుతుంని జోగయ్య చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన 60 నియోజకవర్గాల్లో పది వేలకు పైగా ఓట్లు సాధించిందని గుర్తు చేసారు. అదే విధంగా ఆరు ఎంపీ నియోజకవర్గాల్లోనూ బలం ఉందని విశ్లేషించారు. రెండు పార్టీలకు ఒకరి అవసరం మరొకరికి ఉందని ఈ పరిస్థితుల్లో జనసేనకు సీట్లు..పవర్ షేరింగ్ లో టీడీపీ తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these