లోకేష్‌తో వంగవీటి..ఇంకా తేలాల్సింది అదే.!

గత ఎన్నికల నుంచి బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే..అది వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ గురించే..ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుంది..అసలు ఆయన టి‌డి‌పిలో ఉంటారా? వేరే పార్టీలోకి వెళ్తారా? ఎక్కడ పోటీ చేస్తారు? అనే చర్చ వస్తూనే ఉంది. ఇప్పటికే ఆయన పార్టీ మారతారని, పలనా సీటులో పోటీ చేస్తారని చర్చ జరుగుతూనే ఉంది.కానీ రాధా ఎప్పటికప్పుడు తన చేతలతోనే క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వగా, ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ఇదే సమయంలో రాధా బెజవాడలో లోకేష్ ఎంటర్ అయినప్పుడు రాలేదు. కానీ మధ్యలో ఆయన ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. లోకేష్‌ని ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఈ దెబ్బతో రాధా టి‌డి‌పిలోనే ఉంటున్నారని మరోసారి తేలిపోయింది. ఆయన పార్టీ మారిపోతున్నారని కథనాలు ఇచ్చేవారికి చెక్ పెట్టారు. సరే రాధా గతంలో కొన్ని పార్టీలు మారి వచ్చారు..కానీ వరుసగా ఓటములు పలకరించాయి. 2004లోనే ఒకసారి గెలిచారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పిలోకి వచ్చిన పోటీ చేయలేదు.టి‌డి‌పి కోసం ప్రచారం చేశారు. తర్వాత టి‌డి‌పి ఓడిపోయాక కాస్త రాజకీయాలకు దూరం జరిగారు. కానీ ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్ లకు మద్ధతు తెలుపుతూనే ఉన్నారు. అమరావతి పాదయాత్ర, లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి లోకేష్ పాదయాత్రలో ఎంట్రీ ఇచ్చారు.ఇక అంతా బాగానే ఉంది..కానీ ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఆయన సొంత ప్లేస్..విజయవాడ సెంట్రల్ లో టి‌డి‌పి నేత బోండా ఉమా ఉన్నారు. ఇటు ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ ఉన్నారు. వెస్ట్ లో పోటీ చేయరు. ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. మరి చూడాలి రాధా ఈ సారి ఎక్కడ బరిలో ఉంటారో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these