గుంటూరు వెస్ట్.. రెండు పార్టీల్లోనూ ఇప్పుడిదే హాట్ సీట్.. ఎందుకు అలా..?

అదృష్టం కలిసొస్తే… అవకాశం..వస్తే అక్కడినుంచే పోటీకి వారంతా సిద్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు కాదు ముగ్గురు నలుగురు ఆ సీటుపై కన్నేశారు. కానీ అధిష్టానం మాత్రం క్యాస్ట్‌ ఈక్వేషన్‌తోనే క్యాండేట్‌ని ఫైనల్‌ చేయాలనుకుంటోంది. దీంతో ఇప్పటినుంచే అధికార పార్టీలో ఆ సీటు చుట్టూ నేతల వ్యూహాత్మక ఎత్తుగడలు మొదలయ్యాయి. అటు ప్రతిపక్షం నుంచి కూడా ఆశావహులు తెరపైకొస్తున్నారు. కాని అధిష్ఠానం ఇంకా ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారు.

గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ ఒకటి. ఇక్కడినుంచి పోటీకి టీడీపీ, వైసీపీల్లో చాలామంది నేతలు మేం రెడీ అంటున్నారు. జిల్లాకేంద్రంలో కీలకమైన ఆ సీటుపై నేతలు గట్టిగానే గురిపెట్టారు. అధికార పార్టీలో గుంటూరు వెస్ట్‌ సీటుకు పోటీ ఎక్కువగా ఉంది. కమ్మ, కాపు సామాజిక ఓటర్లు కీలకమైన ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరికివారు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీనుంచి గెలిచిన మద్దాలి గిరి తర్వాత వైసీపీకి జై కొట్టారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన గిరి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీనుంచి పోటీకి సిద్ధమయ్యారు. కచ్చితంగా టికెట్‌ తనకేనన్న నమ్మకంతో ఉన్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కానీ గిరి ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చెప్పలేమన్నట్లుంది సిట్యువేషన్‌. ఎందుకంటే అధికారపార్టీనుంచే మరికొందరు ముఖ్యనేతలు పశ్చిమ సీటుపై కన్నేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these