మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఓ ఆదివాసీ యువకుడి తలపై మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది.
ఆ ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు.
మీకు రేషన్ వస్తుందా? మీరేం చేస్తుంటారు? పిల్లలు చదువుకుంటున్నారా అంటూ ఆయనని అడిగారు.
అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.