ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

Case of pouring urine on adivasi youth: CM Shivraj Singh apologized after washing the feet of the victim

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఓ ఆదివాసీ యువకుడి తలపై మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది.

ఆ ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు.

మీకు రేషన్ వస్తుందా? మీరేం చేస్తుంటారు? పిల్లలు చదువుకుంటున్నారా అంటూ ఆయనని అడిగారు.

అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these