సెకండ్ లీడ్ 70లక్షలు మెయిన్ లీడ్ 2కోట్లు?

బ్యూటీ విత్ బ్రెయిన్ శ్రీలీల మ్యాజికల్ వేవ్స్ అంతకంతకు సమ్మోహనం లో ముంచేస్తున్నాయి. శ్రీలీల పాపులారిటీ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. ఈ భామ లో అందానికి అందం చక్కని డ్యాన్సింగ్ స్కిల్ ప్రధాన అస్సెట్. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ సరసన గుంటూరు కారం లో రెండో నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తొలుత పూజా హెగ్డే ని గురూజీ త్రివిక్రమ్ ప్రధాన నాయికగా ఎంపిక చేశారు. అయితే ఏమైందో కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా ని తొలగించారని పూజా చేయాల్సిన ప్రధాన లీడ్ లోకి శ్రీలీల ను షిఫ్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సమయం సందర్భాన్ని బట్టి శ్రీలీల ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ కెరీర్ ని అన్నివిధాలా చక్కదిద్దుకుంటోంది.

తొలిగా మహేష్ సరసన కథానాయికగా అవకాశం రావడమే లక్. ఇప్పుడు తానే ప్రధాన కథానాయిక కాబట్టి దానికి తగ్గట్టు కాల్షీట్లు ఎరేంజ్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు పారితోషికాన్ని రీఎరేంజ్ చేయాల్సి ఉంటుంది.

కానీ శ్రీలీల ఇక్కడే తెలివైన ఎత్తుగడ తో అందరినీ స్పెల్ బౌండ్ చేసింది. నిజానికి  రెండవ కథానాయికగా చేసేందుకు ఈ చిత్రాన్ని 70 లక్షల కు చేయడానికి అంగీకరించింది. ఇప్పుడు ప్రధాన కథానాయిక గా ఛాన్స్ దక్కినా కానీ తన రెమ్యునరేషన్ ను పెంచలేదని తెలిసింది. మొదట అంగీకరించిన మొత్తానికే ఇప్పటికీ సినిమా చేస్తోంది.

అందుకే శ్రీలీల ను బ్యూటీ విత్ బ్రెయిన్ గా ప్రశంసిస్తున్నారు. సమయం సందర్భాన్ని బట్టి ప్రవర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మహేష్ తో గుంటూరు కారం హిట్టు కొడితే శ్రీలీల రేంజ్ అమాంతం పెరుగుతుంది. తన పై అగ్ర కథానాయికుల కన్ను పడుతుంది.

ఆ రకంగా తన స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఒక్కో సినిమా కు 3కోట్లు పైగానే డిమాండ్ చేసినా అది అర్థవంతమైనది. నిజానికి శ్రీలీలా ఇతర సినిమాలకు ఒక్కో సినిమా కు 2 కోట్ల రేంజ్ లో వసూలు చేస్తుందనేది టాక్. కానీ గుంటూరు కారం కోసం అలా చేయడం లేదు. ఇది నిజంగా తెలివైన ఎత్తుగడ. సినిమా బ్లాక్ బస్టర్ కొడితే దర్శకనిర్మాతలే శ్రీలీల కు ఖరీదైన కానుకలు అందజేయడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these