రాష్ట్రంలో పేకాట, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారు టీడీపీ నాయకులు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు సొంత పార్టీ నేతలకు కేసినోల పేరిట సంపద సృష్టించి ఇస్తున్నారు. బరితెగించి బోర్డులు పెట్టి మరీ పేకాటలాడిస్తూ, చట్ట విరుద్ధమైన వాటిని కూడా చట్టబద్ధం చేసేస్తున్నారు. మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో రిక్రియేషన్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.
ఆగిరిపల్లిలో లోకేష్ అనుచరుడు కాట్రగడ్డ అశోక్ ఈ కేసినో నిర్వహిస్తున్నాడు. పేకాట క్లబ్ లు ఇలా నడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు , హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏం చేస్తున్నారు అని తానేటి వనిత మాజీ హోంమంత్రి ప్రశ్నించారు.
