కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నిప్రమాదానికి గురైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడంతో పాటు చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.
ఆ విండో లేకపోతే నేను బస్సులో కాలిపోయేవాలిని.. ప్రయాణికుడు
కర్నూలు బస్సు అగ్నిప్రమాద భయానక పరిస్థితులను వివరించిన ప్రయాణికుడు
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 27 ఏళ్ల జయంత్ కుష్వాహా
ఎమర్జెన్సీ విండో లేకపోతే నేనూ ఆ బస్సులో కాలిపోయే వాడిని: జయంత్
కర్నూలు 10 కిలోమీటర్లు ముందే ఈ ప్రమాదం జరిగింది: జయంత్
బస్సు ప్రమాద ఘటన పై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ
ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష
ఘటన స్థలానికి బయలుదేరిన జెన్కో సీఎండీ హరీశ్
ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు
మి. శ్రీరామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ – 9912919545
ఈ. చిన్ని బాబు, సెక్షన్ ఆఫీసర్ – 9440854433
హెల్ప్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్న ప్రోటోకాల్ డైరెక్టర్
కర్నూల్ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి
కర్నూల్ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం.
ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారన్న వార్తలు దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ప్రమాదంలో గాయపడిన వారంతా క్షేమంగా ఉండాలని, సంపూర్ణంగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
