విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమాను రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.
