అన్నీ మంచి శకునాలే.. ముంబై కా బాప్‌లా వైజాగ్‌.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

నేడు చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

అన్నీ మంచి శకునాలే..! వైజాగ్‌ అభివృద్ధిపై తగ్గేదేలే..! అంటున్నారు సీఎం చంద్రబాబు. ఏం తక్కువ మన నగరానికి.. అన్ని వనరులు దండిగా ఉన్నాయ్. అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయ్. వస్తారు.. అందరూ వస్తారు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారు. లక్షలాది ఉద్యోగాలూ ఇస్తారు. మరో ముంబైలా వైజాగ్‌ మారడం పక్కా అని పదేపదే చెబుతున్న చంద్రబాబు.. ఆ దిశగా కీలక ముందడుగు పడిందన్నారు.

విశాఖ రేంజ్‌… నెక్ట్స్‌ లెవల్‌ అంటున్నారు సీఎం చంద్రబాబు. ముంబై కా బాప్‌లా వైజాగ్‌ను మారుస్తానంటున్నారు. రైల్వే జోన్‌ ట్రాక్‌లోకి వచ్చిందన్నారు. త్వరలోనే ఎన్నో కంపెనీలు క్యూ కట్టబోతున్నాయని తెలిపారు. వైజాగ్‌లో మెట్రో కూత త్వరలోనే వినబోతున్నరని ఇప్పటికే ప్రకటించారు. ముంబై నమూనాలో వైజాగ్‌ను తయారుచేస్తామన్నారు. అంతేకాదు విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తయారు చేశామన్న ఆయన.. త్వరలోనే యాక్షన్‌ ప్లాన్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఇక విశాఖ రీజియన్‌పై కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే ఏడేళ్లలో మరో ముంబయిలా విశాఖ తయారు కావాలన్నారు. విశాఖ రీజియన్‌ నుంచి 2032 నాటికి 120 బిలియన్‌ డాలర్ల సంపద సృష్టి జరగాలంటూ చంద్రబాబు డైరెక్షన్‌ ఇచ్చారు.

ఇక ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పుతామన్నారు చంద్రబాబు. అలాగే 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖ రీజియన్‌ అభివృద్ధిలో ఏడు కీలక రంగాలు కీరోల్ ప్లే చేస్తాయన్నారు చంద్రబాబు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్‌ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి 7 గ్రోత్‌ ఇంజిన్లపై అధికారులు ప్రత్యేక శ్రద్దపెట్టాలని అధికారులకు సూచించారు. మొత్తంగా… వైజాగ్‌ ముంబై కా బాప్‌లా ఉంటుందన్న బాబు.. ఏడేళ్లు టైమిస్తే బొమ్మ అద్దిరిపోద్దంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these