నిర్మాత ఎస్ కే ఎన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎస్ కే ఎన్‌కి సామాజిక బాధ్యత చాలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే సోషల్ మీడియా వేదికగానే సమస్యను తెలుసుకుని వీలైన సాయం చేస్తుంటారు. ఇక తాజాగా ఓ రేసింగ్ వీడియో వైరల్ అవ్వడంతో దానిపై రియాక్ట్ అయ్యారు. పోలీసులకు విలువైన సూచనలు ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లో అర్దరాత్రి కొంత మంది బైక్ రేసింగ్, కార్ రేసింగ్ అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఇక అందులో కొంత మంది ఆకతాయిలు చేసే విన్యాసాలకు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీకెండ్ వస్తే ఇక హైటెక్ సిటీ రోడ్ల వైపు ఈ రేసింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా ఇలానే ఓ కారు శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.