అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన అల్లు అర్జున్, రామ్‌ చరణ్, ఎన్టీఆర్!

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన అల్లు అర్జున్, రామ్‌ చరణ్, ఎన్టీఆర్!

గుజరాల్‌లోని అహ్మ‌దాబాద్ ఎయిర్‌ సమీపంలో జరిగిన ప్రమాదం యావత్‌ దేశాన్ని క‌లిచి వేస్తుంది. 242 మంది ప్రయాణికులతో లండన్‌ వెళ్లేందుకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఓ బిడ్జింగ్‌ను ఢీకొని నేలకూలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులతో పాటు బిల్డింగ్‌లో ఉన్న కొంతమంది మెడికల్‌ స్టూడెంట్స్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌ సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గుజరాల్‌లోని అహ్మ‌దాబాద్ ఎయిర్‌ సమీపంలో జరిగిన ప్రమాదం యావత్‌ దేశాన్ని క‌లిచి వేస్తుంది. 242 మంది ప్రయాణికులతో లండన్‌ వెళ్లేందుకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఓ బిడ్జింగ్‌ను ఢీకొని నేలకూలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులతో పాటు బిల్డింగ్‌లో ఉన్న కొంతమంది మెడికల్‌ స్టూడెంట్స్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతితో పాటు, ప్రధాని మోదీ పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌, జాన్వీ కపూర్ సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ కొద్ది క్ష‌ణాల‌లో కుప్ప‌కూలింద‌నే వార్త తననెంతో క‌లచి వేసింద‌ని యాక్టర్ జాన్వీ క‌పూర్ అన్నారు. ఆ బాధ‌ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేమని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై స్టార్ హీరో అల్లు అర్జున్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త విని తన నా హృద‌యం ముక్క‌లైందని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాల‌కి తన ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నట్టు ఆయన రాసుకొచ్చారు. ఇదే ఘటనపై అటు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.ఈ విమాన ప్ర‌మాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మరో నటుడు మంచు విష్ణు కూడా ఈ ఘ‌ట‌నపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో శుక్రవారం జ‌ర‌గాల్సిన క‌న్న‌ప్ప ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. హీరో రామ్‌ చరణ్‌ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these