పహల్గామ్ ఉగ్రదాడిపై రగిలిపోతోన్న భారత్.. దీని వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని బలంగా నమ్ముతోంది. దాయాది పన్నాగంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ కూడా భారత్‌ను కాపీకొట్టింది. సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకుంది. దీంతో పారామిలటరీ బలగాలకు సెలవులను రద్దుచేశారు.
పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఏ క్షణమైనా భారత్ తమపై దాడిచేయొచ్చని భావిస్తోన్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో తన బలగాలను అప్రమత్తం చేసింది. భారత్ కూడా అన్ని ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసింది.