AP Inter Results 2025 : ఒక్క క్లిక్‌తో ఏపీ ఇంటర్ ఫలితాలు….

ఏపీ ఇంటర్ ఫలితాలు....

ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లలో అత్యంత వేగంగా చూడొచ్చు.

సమయం రానే వచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఏపీ విద్యార్ధులకు.. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేయనున్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్ ద్వారా అత్యంత వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. మీరు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే మిత్ర వాట్స్ యాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌ పెట్టినా.. ఫలితాలు మీకు సులువుగా అందుతాయి. కాగా, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి.

ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత, సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత

— ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.

— ఫలితాలు విడుదల చేశారు మంత్రి నారా లోకేష్‌

— ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత

— ఇంటర్‌ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత

— రాష్ట్రవ్యాప్తంగా సీనియర్, జూనియర్ ఇంటర్ కలిపి మొత్తం 10 లక్షల 17 వేల102 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు

— ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్.. మన మిత్ర వాట్సప్ యాప్‌లో ఫలితాలు పొందవచ్చన్నారు.

రిజల్ట్స్ చూసుకోండి ఇలా

ముందుగా అధికారిక వెబ్‌సైట్ results.gov.in లేదా results.bie.ap.gov.in లోకి వెళ్లండి. అక్కడ రిజల్ట్స్ ట్యాబ్ ఎక్కడ ఉందో చూసి, క్లిక్ చెయ్యండి. మీ వివరాలు ఇవ్వండి. ఆ తర్వాత సబ్‌మిట్ కొట్టగానే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అనంతరం వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these