Akkada Ammayi Ikkada Abbayi Review : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమా ఎలా ఉందంటే..

Akkada Ammayi Ikkada Abbayi Review : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమా ఎలా ఉందంటే..

ఇన్నాళ్లు బుల్లితెరపై తనదైన కామెడీ పంచులతో.. అద్బుతమైన హోస్టింగ్‏తో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు యాంకర్ ప్రదీప్. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్నాళ్లు టీవీ షోలతో అలరించిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హిట్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు.

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అంతకు ముందు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రంలో ప్రదీప్ సరసన యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే హీరోయిన్‏గా వెండితెరకు పరిచయం కాబోతుంది. గతంలో ఢీ షో ద్వారా వీరిద్దరి జోడి బాగానే క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరూ హీరోహీరోయిన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కొన్నాళ్లుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించింది చిత్రయూనిట్. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ మూవీ ఫస్ట్ టికెట్ కొని మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని.. ఎక్కడ బోర్ కొట్టలేదని.. సినిమా చూస్తూ హ్యాప్పీగా నవ్వుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అలాగే ఈ సినిమాలో భరత్ చేయించిన కామెడీ అదిరిపోయిందని.. సినిమా బాగుందని అంటున్నారు. ఎప్పటిలాగే యాంకర్ ప్రదీప్ తన కామెడీ టైమింగ్ తో మరోసారి నవ్వించారని.. ఆద్యంతం నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని టాక్. గెటప్ శ్రీను, సత్య కామెడీ, వారి ట్రాక్ సినిమాకు హైలెట్ అని.. ప్రదీప్, దీపిక స్ర్కీన్ ప్రెజన్స్ కెమిస్ట్రీ బాగానే కుదిరిందని అంటున్నారు. మొత్తానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these