ట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో పలువురు వెండితెర, బుల్లితెర నటీనటులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా స్పందించారు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పేరు కూడా రావడం, కేసు నమోదైన నేపథ్యంలో ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారని స్పష్టం చేసింది. ఆ కంపెనీ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఆ కంపెనీలను చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ స్కిల్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆయన ఏ ప్రకటన చేసినా, కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా.. సదరు సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నారా? లేదా అన్నది విజయ్ టీమ్ క్షుణ్నంగా పరిశీలిస్తుంది.
ఆ కంపెనీ లేదా ఉత్పత్తి చట్టప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ్ దానికి ప్రచార కర్తగా ఉంటారు’ అని విజయ్ టీమ్ తెలిపింది. అంతేగాక, అలాంటి అన్ని అనుమతులు ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్‌కు విజయ్ అంబాసిడర్‌గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు కూడా తెలియజేసిందన్నారు. ఏ23అనే కంపెనీతో విజయ్ తో ఒప్పందం గత ఏడాదే ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నార. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదు అని విజయ్ దేవరకొండ టీమ్ స్పష్టం చేసింది.
బెట్టింగ్ వ్యవహారంపై రానా దగ్గుబాటి క్లారిటీ
బెట్టింగ్ వ్యవహారంపై రానా దగ్గుబాటి టీమ్ కూడ స్పందించింది. స్కిల్ బేస్డ్ గేమ్‌లకు మాత్రమే నటుడు రానా దగ్గుబాటి అంబాసిడర్‌గా వ్యవహరించారంటూ ఆయన టీమ్ పేర్కొంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో రానా పేరు కూడా చేర్చడంతో ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. రానా చేసిన ప్రకటన గడువు 2017లోనే ముగిసినట్లు ప్రకటించింది.
‘రానా స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌నకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారు. అది కూడా కొన్ని ప్రాంతాల వరకే టెలికాస్ట్ అయ్యింది. చట్టబద్ధంగా అనుమతించిన గేమ్‌లకే రానా ఆమోదం తెలిపారు. ఏవైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి లీగల్ టీమ్ ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చట్టపరమైన సమీక్ష చేసిన తర్వాతే, రానా ఆ ప్లాట్‌ఫామ్‌కు ప్రచారం చేయడానికి అంగీకరించారు. జూదానికి వ్యతిరేకంగా భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ఆన్లైన్ గేమ్‌లను గుర్తించింది. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా స్కిల్ మీద ఆధారపడి ఉన్నాయని, అందుకు చట్టబద్ధంగా అనుమతించినట్లు కోర్టు సైతం తీర్పు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన అంబాసిడర్‌గా వ్యవహరించడం లేదు” – రానా దగ్గుబాటి టీమ స్పష్టం చేసింది.
ముగిసిన విష్ణుప్రియ, దీతూ చౌదరి విచారణ
బుల్లితెర నటులు విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మార్చి 25 మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విష్ణుప్రియను 10 గంటలు విచారించారు పోలీసులు. విష్ణుప్రియ బ్యాంక్ లావాదేవీలు పరిశీలన చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి వచ్చిన నిధులపై ఆరా ఆరా తీస్తున్నారు. రీతూ చౌదరిని ఆరు గంటలు పోలీసులు విచారించారు.