ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చేసారు. పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసారు. పొత్తులు అవసరం ఏంటో వివరించారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి పని చేయాల్సిందేనని స్పష్టం చేసారు. గత అయిదేళ్లు కాలంలో పార్టీ కేడర్ ఎంతో నష్టపోయిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. మహిళలకు పార్లమెంట్.. అసెంబ్లీలో సీట్లు పెరగబో తున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పని చేయాలని చంద్రబాబు నిర్దేశించారు.
మిషన్ 2029
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రతి టీడీపీ కార్యకర్త 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేసారు. గడిచిన అయిదేళ్లు కాలంలో కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు వచ్చినా టీడీపీ ఎప్పు డూ అధైర్య పడలేదన్నారు. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నామని.. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే బీజెపీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఏపీ కోసమే కలిసి వెళ్లాలనే నిర్ణ చి ముందుకు వెళ్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రిగా ఉండి చాలా కష్టాలు చూస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి పదవి అంటే అనుభవించడం కాదన్నారు. తాను సమస్యలతో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
పొత్తులు కొనసాగాలి
రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా ఆర్థిక వ్యవస్థ వెసులుబాటు లేదున్నారు. గత ప్రభుత్వం వల్ల వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని .. వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదన్నారు.కేంద్రం నుంచి వచ్చే నిధులను అభివృద్ధితోపాటు మిగిలిన వాటిని సంక్షేమానికి వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అనుభవం పార్టీకి అవసరం, పరిగెత్తే యువ రక్తం కూడా అవసరమని చెప్పారు. ఎక్కడైనా కార్యక ల ట్రాక్ట్ బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే చర్య తీసుకునే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల దేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి మహానాడు కడపలో పెడుతున్నామని .. టీడీపీ ఆవిర్భావం తరువాత తొలి సారి కడపలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పార్టీని గెలిపించేదీ .. నడిపించేదీ బలహీన వర్గాలనేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పెరగనున్న సీట్లు
ఎప్పటికప్పుడు పని తీరు మెరుగు పర్చుకొనేందుకు కార్యకర్తలు సిద్దం కావాలని చంద్రబాబు సూచించారు. మైండ్లో ఎప్పుడూ 2029 ఎన్నికలను గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు. మహిళలకు త్వరలో 1/3 రిజర్వేషన్స్ అసెంబ్లీ, పార్లమెంటులో వస్తున్నాయని చెప్పారు. హామీల అమలుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తొమ్మది నెలల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉందని పేర్కొన్నారు. నిరంతరం నేతలు పార్టీ కార్యలయాలకు వెళ్లాలని.. కార్యకర్తలతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్దేశించారు.