Pawan Kalyan: పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

చిత్రాడలో జనసేన జయకేతనం ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇక జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు నాగబాబు. అధికారంలో ఉన్నాం కదాని అహంకారంతో మాట్లాడకూడదన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆచితూచి మాట్లాడాలని.. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో చూశామన్నారు. జనసేన ప్రతిపక్షంలో లేదని.. కార్యకర్తలు ఆచితూచి మాట్లాడాలన్నారు నాగబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these