ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు విశిష్ట సేవలందిస్తూ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడంలో అవిరల కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి ధాత్రి రెడ్డి గారు సహా ఏలూరు జిల్లాలో పలు ప్రభుత్వ ప్రైవేటు శాఖల్లో విధులను నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు సిబ్బంది సహా గృహిణులుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..
ఈసందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ..”సమాజ ప్రగతికైన, ఒక కుటుంబం సమగ్ర అభివృద్ధికి అయినా మహిళ పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా ప్రతి ఒక్క మహిళకు మనందరం కలిసి భరోసా ఇద్దాంమని, సమాజంలో అన్యాయానికి , వేధింపులకు, వివక్షకు గురవుతున్న ప్రతి మహిళకు ఒక సోదరుడిగా మనం అండగా నిలుద్ధాం అని అన్నారు. అంగన్వాడీ నుంచి అంతరిక్షం వరకు నేడు మహిళలదే పై చెయ్యి అని – కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రతా, సంరక్షణకు పటిష్టమైన చర్యలు అమలు చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..