Minister Lokesh: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. పలు సంస్కరణలకు రంగం సిద్ధం!

Minister Lokesh: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. పలు సంస్కరణలకు రంగం సిద్ధం!

విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాట్రన్ అంటూ ఏమీ లేదని 2016లో 6 గురు చనిపోతే.. 2019లో నలుగురు చనిపోయారన్నారు. 2021లో ఏడుగురు చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17మంది, 2024లో ఆరుగురు చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటర్ విద్యలోనే చోటుచేసుకున్నాయని మంత్రి లోకేష్ అన్నారు..

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే.. సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పానని మంత్రి లోకేష్‌ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాట్రన్ అంటూ ఏమీ లేదని 2016లో 6 గురు చనిపోతే.. 2019లో నలుగురు చనిపోయారన్నారు. 2021లో ఏడుగురు చనిపోయారు. 2022లో 12 మంది, 2023లో 17మంది, 2024లో ఆరుగురు చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాట్రన్ లేదు. అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటర్ విద్యలోనే చోటుచేసుకున్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఒకేడాది ఒకరిద్దరు చనిపోతే, మరో ఏడాది 11 మంది, మరో ఏడాది ఒకరు చనిపోయారు. దీనికి ప్యాట్రన్ లేదు. యూనివర్సిటీల్లో కూడా ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి 18 మంది చనిపోయారు.

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్ నెస్ టీమ్స్ ఏర్పాటు

స్కూల్ వెల్ నెస్ టీమ్స్ ఏర్పాటుచేసి ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీయర్ సింప్టమ్స్ ను క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్స్ ను నియమించామని అన్నారు. వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సింప్టమ్స్ ను పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి, సరిచేయడంతో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన క్యూపీఆర్ ఇన్ స్టిట్యూట్ వారు బెంగళూరులో ఓ పార్ట్నర్‌తో ఒప్పందం చేసుకున్నామని, స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కోసం గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్‌మెంట్ కు వారితో సంప్రదిస్తున్నామన్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలీ కౌన్సిలింగ్ సర్వీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే.. మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్ సీసీ, రెడ్ క్రాస్ ను కూడా పాఠశాల విద్యలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్ సీసీ డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారిని కూడా కోరడం జరిగింది. రెప్యుటెడ్ ఎన్జీవోస్ తో ఒప్పందం కుదుర్చుకుని ఆత్మహత్యలు నివారించాలని, పిల్లల్లో ఎర్లీ సింప్టమ్స్ ను గుర్తించాలని మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది.

తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్ట్‌ల్లో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం. కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. కరిక్యులమ్ రీవ్యాంప్ చేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఆత్మహత్యలు చోటుచేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేటు, గవర్నమెంట్ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేటు యాజమాన్యంపై కూడా బాధ్యత ఉంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని వాకబు చేస్తున్నామని అన్నారు. హ్యుమిలియేషన్ తట్టుకోలేక కూడా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. అలాగే పాఠశాలల్లో యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే ఏడాది నుంచి వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటుచేస్తామని, స్కూల్స్ గ్రౌండ్స్ అన్నీ మ్యాప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో జీఆర్ (గ్రాస్ ఎన్ రోల్ మెంట్) రేషియో 36.5 శాతం, ఢిల్లీ 49 శాతం, తమిళనాడులో 47 శాతంగా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45 శాతం కంటే ఎక్కువగా ఉంది. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళంలో 30 నుంచి 35 శాతం మధ్య ఉంది. మహిళల విషయానికి స్టెమ్ కోర్సుల్లో తక్కువగా ఉన్నారు. పేటెంట్ ఫైలింగ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో కేవలం 1,400 మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి. కానీ తమిళనాడులో 7,600 పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి. విశ్వవిద్యాలయాలకు వస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానంలో ఉన్నాం. PhD విద్యార్థు విషయానికి వస్తే ఏపీలో 5,600 మంది ఉంటే.. తమిళనాడులో 29వేల మంది ఉన్నారు. ప్రస్తుతానికి మనవద్ద ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా లేదు. విద్యార్థుల ప్లేస్ మెంట్స్, జీతాల వివరాలు లేవు.

ఇండస్ట్రీ లైక్ కరిక్యులమ్ తీసుకువస్తాం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్(లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో సెక్టర్స్ స్పెసిఫిక్ ఇన్ స్టిట్యూషన్స్ పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్ లు, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలనేది ఒక నిర్ణయం. ఇండస్ట్రీ లైక్ కరిక్యులమ్ తీసుకురానున్నాం. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అందరికీ చెబుతున్నాం. పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీతో మాట్లాడినప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్లు అన్నీ భర్తీ అవుతున్నాయి. లాంగ్వేజెస్, ఆర్ట్స్ సీట్లు భర్తీ కావడం లేదు. విద్యార్థులు వీటిపై శ్రద్ధ చూపించడం లేదు. మేం మొన్న మా పదో తరగతి మిత్రులతో కలిసినప్పుడు 42 మందిలో ఇద్దరు ఇతర దేశాల్లో లాంగ్వేజెస్ పై రీసెర్చ్ చేస్తున్నారు. లాంగ్వేజెస్ కు సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అన్నింటిని పరిశ్రమలతో అనుసంధానిస్తాం. ఇంటర్నషిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తాం.

ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ

యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నమాట వాస్తవం. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే పరిశ్రమ నిపుణులతో ప్రాక్టీషనర్స్ పాఠాలు చెబితే బాగుంటుందని భావిస్తున్నాం. అక్రిడేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ కూడా చాలా అవసరం. అది కూడా తీసుకువస్తున్నాం. ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్.. కెపాసిటీ బిల్డింగ్, వారికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ విజిట్ వంటివన్నీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. డిజిటల్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తాం.

డీఎస్సీ విషయంలో గతంలో జరిగిన తప్పులను స్టడీ చేసి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పకడ్బందీ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కూడా కోర్టులో ఉంది. దీనిపై ఏజీతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ లో ఏపీ 9వ స్థానంలో ఉంది. 3 వ స్థానానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్యూఎస్ ర్యాంకింగ్ లో టాప్-100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these