Tollywood Singer Kalpana: ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

Tollywood Singer Kalpana: ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తుంది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కల్పన. హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు కల్పన దంపతులు. కాగా ఆమె ఆత్మహత్యాయత్నంకు కారణం తెలియాల్సి ఉంది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం, కాగా  సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తున్నారు.

కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సింగర్ కల్పన. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్‏లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. మెలోడి సాంగ్స్‏తోపాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ ఆమె పాల్గొన్నారు.

గతంలోనూ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 27 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010లో విడాకులు అయ్యాయి. అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిని చదివించాలి. కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా ? అంటూ నాకు ధైర్యం చెప్పి.. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది అని తెలిపారు కల్పన.

కల్పనా భర్త ప్రసాద్ ను కేపీహెచ్‌బి పోలీసులు విచారిస్తున్నారు. నిజాంపేట్ లోని ఇంట్లో ఒక్కతే ఉంటున్న కల్పన. చెన్నైలో ఉంటున్న కల్పన భర్త ప్రసాద్. రెండు రోజులుగా డోర్ తీయకపోవడంతో ప్రసాద్ కు ఫోన్ చేసిన స్థానికులు. దాంతో ఈరోజు మధ్యాహ్నం చెన్నై నుంచి వచ్చాడు కల్పనా భర్త ప్రసాద్. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these