ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు వారి తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనున్నట్లు చెప్పారు.
విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు బడ్జెట్ సమావేశంలో మంత్రి ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్దెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు ప్రకటించింది