విరాట్ కోహ్లీ వీరవిహారం..ఎనిమిదేళ్ల ఘోర పరాభవానికి ప్రతీకారం

విరాట్ కోహ్లీ వీరవిహారం..ఎనిమిదేళ్ల ఘోర పరాభవానికి ప్రతీకారం

దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్‌‌లో మరోసారి కోహ్లీ సత్తా చాటాడు. సెంచరీతో కోహ్లీ అదరగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ అర్థరాత్రి సెంచరీతో ఆకట్టుకున్నాడు.శుభ్‌మాన్ గిల్ 46, కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేశారు.

2017లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో ఎదురైన ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.టీమిండియా చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్ ట్రోఫీ నుంచి దాదాపు అవుట్ అయినట్టే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో గ్రూప్ దశలోనే పాకిస్థాన్ జట్టు టోర్ని నుంచి నిష్క్రమించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ 241 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సౌద్ షకీల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే వీరిద్దరి భాగస్వామ్యానికి అక్షర్ పటేల్ తెరదించాడు. అద్భుతమైన డెలివరీతో మహ్మద్ రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

మరోవైపు అర్థ సెంచరీ చేసి జోష్ మీద కనిపించిన సౌద్ షకీల్‌‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు.ఆ తర్వాత కుల్దీప్ మాయజాలం మొదలైంది.సల్మాన్ ఆఘా, షాహీన్ అఫ్రిది,నసీమ్ షా వికెట్లను తీసి పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.అయితే చివర్లో పాకిస్థాన్ టెయిలెండర్లు బ్యాట్ ఝుళిపించడంతో పాక్ 240 మార్క్‌ను అందుకుంది. పాకిస్థాన్ బౌలర్ల పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these