ఏలూరు లో గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి అసోసియేషన్ ఆఫీసు నందు విద్యానిది పై వచ్చిన వడ్డీ నుండి ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన 26 మంది కాపు విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 3000 లు చొప్పున రూ.78,000 లు ఆర్ధిక సహాయం అందించినారు. అసోసియేషన్ చేయుచున్న విద్యానిది స్ఫూర్తి తో ప్రముఖ వ్యాపారవేత్త మరియు జనసేన నాయకులు నారా శేషు గారి తల్లితండ్రులు అయిన నారా వెంకట నరసింహమూర్తి మరియు సూర్యకాంతం గారి పేరు మీద రూ.1,00,116/- లు విద్యానిధికి అస్సోసియేషన్ కు విరాళాముగా ఇచ్చినారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జెట్టి సింహాద్రి రావు గారు మరియు పట్టగర్ల నాగభూషణం గారు ఇతర కమిటీ సభ్యులు శ్రీ నారా శేషు గారికి చిరు సన్మానంద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు…
