వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుండటంతో దాని వరకే హాజరవుతారా? లేకసమావేశం మొత్తం హాజరవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
అరవై రోజుల పాటు… బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. అయితే 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.