సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు పై ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.
ఈ నెల 23వ తేదీన…
రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23న జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకు వరకూ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, సోషల్మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లను ఆదేశించారు.