దావోస్ షాక్ పవన్ గతంలోనే ఊహించారా ? కామెంట్స్ వైరల్..!

నా వాళ్లు అనుకుంటే ఇలా చేస్తారా..? ఫిల్మ్ ఇండస్ట్రీకి పవన్ డైరెక్ట్ వార్నింగ్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అధికారులు, మంత్రుల బృందం దావోస్ కు వెళ్లింది. దాదాపు ఐదు రోజుల పాటు వారు అక్కడే ఉండి పలువురు టాప్ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. వారికి ఏపీలో పరిస్ధితుల్ని వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఏపీలో పెట్టుబడులు పెడతామంటూ వారిలో ఒకరిద్దరైనా బహిరంగ ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి దావోస్ టూర్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చినట్లయింది.

దావోస్ టూర్ లో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో భేటీ అయిన పారిశ్రామికవేత్తలతో మా రాష్ట్రాల్లో ఎక్కడ మీకు అనువుగా ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టండి.. మొత్తానికి ఇండియాలో అయితే పెట్టుబడులు పెట్టమంటూ చంద్రబాబు కోరారు. దీనికి వారి స్పందన చూస్తే చంద్రబాబు షాకయ్యే పరిస్ధితి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర కూడా భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్ధలో పలు సంస్థలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. కానీ ఏపీలో మాత్రం కనీస పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థా మొగ్గు చూపలేదు. దీంతో దావోస్ టూర్ డిజాస్టర్ లా మిగిలింది.

ఈ నేపథ్యంలో దావోస్ టూర్ కు తీసుకెళ్లని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఇదే దావోస్ పెట్టుబడుల వేటపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జగన్ దావోస్ టూర్ కు వెళ్లి అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులు ఆకర్షిస్తున్న తరుణంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దావోస్ కు వెళ్లిపోయి బ్లూకోట్లు, ఎర్రకోట్లు వేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావాలని లేదంటూ పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటే పెట్టుబడులు ఆటోమేటిగ్గా వస్తాయన్నారు. దావోస్ కు ప్రత్యేక విమానాల్లో వెళ్లి అక్కడ ప్రత్యేక సూట్లలో ఉంటే ఆ ఖర్చు మనం మోయాలంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ను ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these