పవన్ కళ్యాణ్ కు జనసైనికులు షాక్… మంత్రి నాదెండ్ల సీరియస్!

పవన్ కళ్యాణ్ కు జనసైనికులు షాక్... మంత్రి నాదెండ్ల సీరియస్!

జనసేన పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? జనసేన పార్టీ కార్యకర్తలు పదవుల కోసం ఇతర పార్టీ నేతలతో రహస్య సమావేశాలు జరుపుతున్నారా? రహస్యంగా లేఖలు రాస్తున్నారా? వారితో పరిచయాలు పెంచుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కు వారు షాక్ ఇస్తున్నారా? అంటే అవును అన్నా సమాధానమే వస్తుంది. నిన్న మొన్నటి దాకా ఇదంతా ప్రచారం అనుకుంటే తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక ఆ ప్రచారానికి ఊతం ఇచ్చింది.

వారికి నాదెండ్ల మనోహర్ సీరియస్ వార్నింగ్ మంత్రి నాదెండ్ల జనసేన పార్టీ కార్యకర్తల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుతో జనసేన పార్టీ నేతలు పదవుల కోసం పక్క చూపులు చూస్తున్నారు అన్న విషయం అవగతం అయింది. ఇక తాజాగా జనసేన పార్టీ కార్యకర్తలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిఒక్కరు జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. చర్చలు జరపడం వంటి టైం వేస్ట్ కార్యక్రమాలలో పాల్గొనవద్దని హితవు పలికారు.

కొందరు జనసేనపై దుష్ప్రచారం ఇక మనం ఏ తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా కొంతమంది మూర్ఖులు కావాలని పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన దుష్ప్రచారం చేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పదవులు ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా సరే, కార్యకర్తలను తాము కంటికి రెప్పలా కాచుకుంటామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కార్యకర్తలకు పవన్ సాయం మరచిపోవద్దు :

కార్యకర్తల కోసం బీమా పథకం ద్వారా 24 కోట్లు అందించారని 920 మంది కార్యకర్తలకు లబ్ధి చేశారని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు జనసైనికులు అందరూ కలిసి సహాయం చేసిన రోజులు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం చేస్తున్న సాయాన్ని మరిచిపోరాదని ఆయన సూచించారు.

పదవుల కోసం పవన్ పాకులాడలేదు ఇంతకాలం జనసైనికులు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, పదవుల కోసం పాకులాడలేదని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం పని చేసే వ్యక్తి కాదని జనసైనికుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ బాటనే ఎంచుకొని ముందుకు సాగాలి 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రజల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టాడని అప్పటినుంచి ఇప్పటివరకు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన లో ఉన్న కార్యకర్తలు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ బాటనే ఎంచుకొని ముందుకు సాగాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these