Chandrababu: మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు వాస్తవం చెబుతున్నా: సీఎం చంద్రబాబు

మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు వాస్తవం చెబుతున్నా: సీఎం చంద్రబాబు
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వెల్లడి
  • ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని వివరణ
  • కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం మళ్లించలేనని స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగని, కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని స్పష్టం చేశారు. 

మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు వాస్తవం చెబుతున్నానని, ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అప్పు చేసి అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు. 

ఐదేళ్ల విలువైన సమయాన్ని ఏపీ కోల్పోయిందని, 2019 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేదని అన్నారు. గత ప్రభుత్వ పాలన ఫలితంగా రూ.9.5 లక్షల కోట్ల అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. 

ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎప్పుడూ వెనుకడుగు వేయబోమని ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these