ఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే.. రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి.? ఈ మాటలు మీరూ, నేనూ అనుకోవడానికి బానే ఉంటాయి. కానీ కుడి ఎడమల్లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా సెలక్ట్ చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి? సేమ్ సిట్చువేషన్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు.? హరిహరవీరమల్లు.. పవన్ కల్యాణ్ కెరీర్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. ఎ.ఎం.రత్నం సమర్పణలో క్రిష్ మొదలుపెట్టారు. ఇప్పుడు జ్యోతికృష్ణ టేకప్ చేశారు.
ఎడమ కన్నూ నాదే.. కుడి కన్నూ నాదే.. రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్పాలి.? ఈ మాటలు మీరూ, నేనూ అనుకోవడానికి బానే ఉంటాయి.
హరిహరవీరమల్లు.. పవన్ కల్యాణ్ కెరీర్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. ఎ.ఎం.రత్నం సమర్పణలో క్రిష్ మొదలుపెట్టారు. ఇప్పుడు జ్యోతికృష్ణ టేకప్ చేశారు.
మనపైనున్న దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు.. వాడొచ్చి ఈ దొంగ దొరల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే క్రేజ్ తెచ్చుకుంది హరిహరవీరమల్లు.
ఈ మధ్య పవన్ కల్యాణ్ కాల్షీట్లను దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ సెట్స్ అన్నిటినీ విజయవాడ పరిసరాల్లో వేశారు. గట్టిగా ఇంకో షెడ్యూల్ చేస్తే, సినిమా మొత్తం పూర్తవుతుందన్నది మేకర్స్ చెబుతున్న మాట.
వచ్చే ఏడాది మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎ.ఎం.రత్నం. మరి ఓజీ సంగతేంటి.?
హరిహరవీరమల్లుతో పాటు ఓజీ మీద కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో నాలుగైదు రోజులు పవన్ కాల్షీట్ ఇస్తే చాలు.. సినిమాను కంప్లీట్ చేసేసుకుంటామనే మాట ఈ కాంపౌండ్‌లోనూ వినిపిస్తోంది.
మరి ఈ సినిమా షూటింగ్‌ని పవర్‌స్టార్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఓజీ వర్సెస్ హరిహరవీరమల్లులో పవర్‌స్టార్ ఎటు మొగ్గుతారు? ఏ సినిమాను ఫస్ట్ రిలీజ్ చేస్తారు.. ఇవన్నీ వేయి డాలర్ల ప్రశ్నలు. పవర్‌స్టార్ సిగ్నల్స్ ని బట్టి ఆన్సర్స్ వెతుక్కోవాల్సిందే.