ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ అవుతారు. మధ్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పవన్ కల్యాణ్ భేటీ ఉంది.
రేపు ప్రధానితో భేటీ…
సాయంత్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమై విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. రేపు కూడా పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మోదీని కలిసి ఆయన కు అభినందనలను తెలపడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు.