అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు….KTR

అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు....KTR

తీర్చలేక హస్తం అవస్థలు
హిమాచల్ ఘటనే ఇందుకు
తార్కాణం గ్యారంటీల
పేరుతో హిమాచల్‌ప్రదేశ్‌ను
దివాలా తీయించిన కాంగ్రెస్
ప్రభుత్వం తెలంగాణలో
ఆరు గ్యారంటీల అమలుకు
ఏం విక్రయిస్తారు?
ఎక్స్ వేదికగా రాహుల్‌ను
నిలదీసిన కెటిఆర్

 హైదరాబాద్ : గద్దెనెక్కడం కోసం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ప రిపాటిగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టీఆర్ ధ్వజమెత్తారు. గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి రా ష్ట్రాన్ని దివాలా తీయించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుకు మరో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించిన విషయం విదితమే ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

చేతికందినన్ని అప్పులు చేయడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రా వడం దారుణమన్నారు. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు..సాక్షాత్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్యారంటీలు అమలు చేయలేక గంజాయి కూడా అమ్ముకునే పరిస్థితి మొన్న! మీరు చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, ఢిల్లీలో మీ హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ఎంత సిగ్గుచేటు? అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడపడానికి బదులుగా సర్కస్‌లను నడుపుతోందని విమర్శించారు. మరి తెలంగాణలో మీరు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మీరు ఏం విక్రయిస్తారని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these