చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం నిర్మాణంలో ఆలస్యం…..మాజీ మంత్రి అంబటి రాంబాబు

పవన్ ఏంటీ సొల్లు కబుర్లు.. అంబటి రాంబాబు సెటైర్లు

పోలవరం పై అసెంబ్లీలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో పోలవరం నిర్మాణంలో పారదర్శకంగా వ్యవహరించామని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు, మోడ కలసి ఏపీ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం జరిగింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు వల్లనే… కేంద్రానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని అంబటి రాంబాబు కోరారు. చంద్రబాబు తాను చేసిన తప్పులను వైసీపీ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పే అసత్యాలను ఎవరూ నమ్మవద్దని అన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమని అంబటి రాంబాబు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత వైఎస్ దేనని ఆయన తెలిపారు.వైఎస్ఆర్ సంకల్పంతోనే రాష్ట్రానికి నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చాయన్న అంబటి రాంబాబు, డయాఫ్రం వాల్ నిర్మించకుండా ప్రాజెక్టులు ప్రపంచంలో ఎక్కడా నిర్మించరని అంబటి రాంబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these