ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి కాపు కులం కొమ్ము కాయడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్డీఏ కూటమిలో కాపులు చాల కిలకంగా పనిచేసారు
అందుచేత చింతలపూడి నియోజకవర్గం లో జనసేన పార్టీ బలం పెరగాలి అంటే చింతలపూడి నియోజక వర్గంలో కాపులకు మంచి గుర్తుంపు ఇవ్వాలని చింతలపూడి ఏఎంసీ జనసేన పార్టీకి ఇవ్వాలని చింతలపూడి నియోజకవర్గం కాపు జేఏసీ పిలుపు ఇవ్వటం జరిగింది.
కాపు జేఏసీ పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉన్నా నాలుగు మండలాల కాపు సంఘం జేఏసీ నాయకులు,కాపు సంఘం సభ్యులు మరియు చింతలపూడి నియోజకవర్గం జనసేన నాయకులు,కార్యకర్తలు అన్ని మండలల నుంచి స్వచ్చందంగా వచ్చి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని కలసి వినతిపత్రం అందజేశారు.
అలాగే ఎన్నికల ముందు జనసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చింతలపూడి AMC జనసేనకు ఇవ్వాలన డిమాండ్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ AMC మాత్రం అన్ని రకాలుగా అర్హత ఉన్న జనసేన చింతలపూడి మండల పార్టీ ప్రెసిడెంట్ చిదరాల మధు బాబుకు ఇవ్వాలని కాపు JAC కోరడం కొసమెరుపు.
ఏది ఏమైనా చింతలపూడి AMC జనసేన లీడర్ మధు కి వస్తుందని జనసేన కార్యకర్తలు, కాపు నాయకులు భావిస్తున్నారు.దినికి ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.