వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు…

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. వైఎస్ జగన్ కూడా ఒంటరి పోరు చేయడానికి సిద్ధం అంటున్నారు. ఎన్నికల దాకా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితులు ప్రజలను ఏ విధంగా ఆలోచింపజేసేలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో రెండు ఓట్లు ఉన్నాయి. వైయస్ జగన్ అనుకూల ఓటు, వైఎస్ జగన్ వ్యతిరేక ఓటు. ఎవరైనా వైయస్ జగన్ సెంట్రిక్ గానే ఓటేస్తారని అంచనా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తేల్చాల్సి ఉంది. విపక్షాలలో కొన్ని సింగిల్ గా మరికొన్ని పొత్తు తో వస్తున్నాయి. ఎవరు ఎలా వచ్చిన తాను మాత్రం సింగిల్ గానే వస్తానని వైయస్ జగన్ ముందుగానే చెప్పేశారు. ఎన్నికల వ్యూహం విషయంలో కూడా ఆయన ముందుగానే ఉన్నారు. ఎవరి వ్యూహం ఎలా ఉన్నా తన వ్యూహం తనకు ఉందని అంటున్నారు.

ఏపీలో ఇప్పటిదాకా జరిగిన రాజకీయం వేరు. ఇక నుంచి జరిగే రాజకీయం వేరు అని అంటున్నారు. విపక్షాల ఎత్తులను ముందుగానే తెలుసుకుని వైయస్ జగన్ వారి కంటే ముందే అడుగు వేస్తున్నారు. ఎన్నికల వరకు ఇదే కొనసాగితే వైయస్ జగన్ గెలుపు ఖాయం అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ వైయస్ జగన్ పద్మవ్యూహంలో ఇరికించాలని ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

వైయస్ జగన్ 6 నుంచి 7 పార్టీలతో పోటీ చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, బీజీయం ఇలా అన్ని పార్టీలు వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్ వామపక్షాలుగా పోటీ చేస్తుంది. అయితే వైయస్ జగన్ ఇమేజ్ తోనే గెలుస్తామని వైసీపీ అంటుంది. విపక్షాలు తడాఖా చూపిస్తామని అంటున్నాయి.

ఇక నోటిఫికేషన్ విడుదలయ్యాక అసలు సిసలైన పోటీ ఉంటుంది. ఎంత వ్యూహరచన చేసిన ఏదో కావాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే సిద్ధమైనా తన వ్యూహం తనకుందని అంటున్నారు. అంతర్గతంగా ప్రతి పార్టీకి కౌంటర్ రెడీ చేస్తున్నా రని అంటున్నారు. విపక్షాలు కూడా తమ వ్యూహాలను అంతర్గతంగా ఉంచి ఒక్కసారిగా చివరికి బయట పెడుతున్నాయని అంటున్నారు.

అయితే ఏపీ ఓటర్లు ఎవరు వైపు నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పథకాల లబ్ధిదారులంతా గంపగుత్తగా మాకే ఓటేస్తారంటూ వైసీపీ చెప్పుకొస్తుంది. పథకాల లబ్ధిదారుల సంఖ్యను ఓటర్ల సంఖ్యగా వైసీపీ భావిస్తుంది. అదే సమయంలో విపక్షాలు కూడా రకరకాలుగా వైసీపీ పై విమర్శలు చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తి ఉందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these