ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కావడంతో యశోద దవాఖానలో శస్త్ర చికిత్స.. వారం రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ గారు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.యశోద నుండి నేరుగా నంది నగర్ లోని నివాసానికి చేరుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సాంప్రదాయ పద్దతిలో దిష్టి తీసి హారతి పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారి వెంట కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు.
