హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని చంద్రబాబు తెలిపారు.
కేసీఆర్ కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని చెప్పారన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకోలుకొని.. ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయని చంద్రబాబు తెలిపారు.