వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, ఐ.టి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శ్రీ శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, తదితరులు హాజరయ్యారు.
