ఆదివారం నాడు అబ్దుల్ కలాం 92వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నందం గనిరాజు జంక్షన్ వద్ద యాంకర్ చోటు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ పేదరికం నుంచి భారత అత్యున్నత పదవికి ఎదిగిన కలాం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
అంతరిక్ష శాస్త్రవేత్తగా,రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించినప్పటికీ నిరాడంబర జీవితాన్ని కొనసాగించి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అని ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు..?ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు.