ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హెటళ్లు నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ ఛైర్మన్, టెక్ మహీంద్ర ఎండీ సీసీ గుర్నాని సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గుర్నాని గురువారం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. స్టార్ హోటల్స్ నిర్మాణంపై జగన్ తో చర్చించారు. హోటళ్ల నిర్మాణంతో ప్రత్యేక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. కాగా ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్ఛు చేయనున్నట్లు గుర్నాని చెప్పారు.
పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి సీఎం జగన్ గుర్నానికి వివరించారు. విశాఖ సహా 3 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే 2 నెలల్లో శంకుస్థాపన చేపడతామని మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
మరోవైపు కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ పంపారు.
కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణలో గోదావరి బోర్డును, ఏపీలో కృష్ణాబోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ శాఖ ఆదేశించిన సంగతి తెసిందే.