చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్లో ఉండడంపై సినీ నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్య…

Natty Kumar – Chandrababu Arrest : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జ్యుడీషియల్‌ రిమాండ్లో ఉండడంపై సినీ నిర్మాత నట్టికుమార్ స్పందించారు.

ఆయన అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణమని చెప్పారు.చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇతరులెవరూ మద్దతు లేదని, ఈ తీరు బాధ కలిగించిందని చెప్పారు. చంద్రబాబు నీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తని అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండటం మానవత్వమని అన్నారు. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లాంటి వ్యక్తులు మద్దతుగా ట్వీట్ చేస్తే చాలని చెప్పారు.టాలీవుడ్ పెద్దల తీరు బాగోలేదని చెప్పారు. పవన్ ఇప్పటికే పెద్ద కొడుకులా ముందడుగు వేశారని, చంద్రబాబుకి మద్దతు ఇచ్చారని అన్నారు. వెనుకాల నుంచి మద్దతు తెలిపేవారు దొంగలని చెప్పారు. ముందుండి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ హీరో అనిపించుకున్నారని అన్నారు.తాను టీడీపీకి దూరంగా ఉంటున్నప్పటికీ చంద్రబాబు నాయుడి మంచి వైఖరికి దగ్గరేనని చెప్పారు. అటువంటి నాయుకుడు ఉండాల్సింది జైల్లో కాదని, ప్రజల్లో ఉండాలని అన్నారు. ప్రజలకు జగన్ ప్రమాదకరమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these