మోడీ ముందు ఎంపీ భ‌ర‌త్ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్‌.. ఎలా మాట్లాడాడో చూడండి..!

వైసీపీ ఎంపీ భ‌ర‌త్‌కి మంచి వాక్ చాతుర్యం ఉన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆయ‌న మాట్లాడే మాట‌లు ఎదుటి వారికి నోట మాట రాకుండా చేస్తాయి. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌ధాని మోదీతో పాటు పలువురు ప్ర‌ముఖుల ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వరం ప్రాజెక్ట్ తో పాటు స్పెష‌ల్ స్టేట‌స్ గురించి ఆయ‌న అంద‌రికి అర్ద‌మ‌య్యే రీతిలో చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం న‌త్త‌న‌డ‌క‌న పోల‌వ‌రం మొద‌లు పెట్టింద‌ని దాని వ‌ల‌న ఈ ప్ర‌భుత్వం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వ‌స్తుంద‌ని అని చెప్పుకొచ్చారు. ద్రబాబు అనాలోచిత పనుల వల్లే పోలవరం ఆలస్యమవుతోందని.. కాఫర్ డ్యాం కట్టకుండా ఈసిఆర్ఎఫ్ డ్యాం కట్టడం క్షమించరాని నేరం అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌‌కు సంబంధించి ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్రం పార్లమెంట్‌లో తెలిపారు. అలానే తాను రామ‌య‌ణం గురించి కూడా కొన్ని వ్యాఖ్య‌లు అద్భుతంగా మాట్లాడ‌డంతో అత‌ని వాక్ చాతుర్యంపై ప్ర‌శంసలు కురిపించారు. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. తన పోటీపై అధినేత జగన్ దే తుది నిర్ణయం అన్నారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైన రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని భరత్ ధీమా వ్యక్తం చేసారు

గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటును వైసీపీ గెల్చుకున్నా.. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ నుంచి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈసారి ఆయా సీట్లలో గెలుపుపై వైసీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇదే క్రమంలో మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అదే జరిగితే బీసీ సామాజికవర్గానికి చెందిన భరత్.. సిట్టింగ్ బీసీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మధ్య పోరు తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these