హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి పైకి వరద నీరు..నిలచిపోయిన రాకపోకలు..

విడవకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

గురువారం హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు వాహనదారులు వరదనీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నప్పటికీ… వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

దాదాపు రెండు కిలోమీటర్ల వాహనాలు బారులుతీరడంతో.. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి.. అక్కడ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these