ఆదిపురుష్ సినిమా కి మొదటి మూడు రోజులు వచ్చిన ఆదరణ సంగతి పక్కన పెడితే ఇప్పుడు నార్త్ ఇండియా లో ఈ చిత్రం పై తలెత్తిన వివాదం తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా హిందుత్వ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల లో ఆదిపురుష్ సినిమా లోని పాత్రల చిత్రణ డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. నిరసనలు చేస్తున్నారు.
రామాయణం గౌరవాన్ని పూర్తిగా ఆదిపురుష్ చిత్రం నాశనం చేసింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కర్నిసేన వారు అయితే మరో అడుగు ముందుకేసి దర్శకుడు ఓం రౌత్ రైటర్ మనోజ్ ని చంపేస్తాం అంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారు. అసలు అయితే తెలుగు లో సంభాషణల విషయం లో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.
కేవలం హిందీ లో మనోజ్ కొన్ని అసందర్భమైన డైలాగ్స్ రాసారు. ముఖ్యంగా హనుమంతుడు భాష డైలాగ్స్ అన్ని కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే సీతా దేవి తో చెప్పించిన కొన్ని డైలాగ్స్ కూడా అసందర్భంగా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. రాఘవుడి మర్యాదని ఈ ఆదిపురుష్ పూర్తిగా నాశనం చేసిందన ఎక్కువ మంది నుంచి వస్తోన్న విమర్శ.
ఓ వైపు ఈ స్థాయిలో ఆదిపురుష్ సినిమా పై వివాదం నడుస్తూ ఉంటే ఈ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ఓ న్యూస్ చానల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత అభ్యంతరకంగా ఉన్నాయి. అసలు హనుమాన్ దేవుడే కాదని ఒక భక్తుడు మాత్రమే అంటూ కామెంట్స్ చేశారు. కేవలం అతని భక్తి కారణంగా అందరి తో దేవుడి గా కీర్తిస్తున్నామని భక్తికి అంత శక్తి ఉందంటూ కామెంట్స్ చేశారు.
నిజానికి ఆయన చేసిన వ్యాఖ్యల లో మరీ వివాదం చేసేంత నెగిటివ్ అయితే లేదు. కాని ఇప్పటికే ఆదిపురుష్ పై హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తోన్న నేపథ్యం లో హనుమంతుడు దేవుడు కాదు అనే మాట వారికి మరింత మంట పుట్టించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. దీని పై వాదుల నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయనేది చూడాలి.
