VFX బేస్డ్ విజువల్ క్రియేషన్ భారతీయ సినిమాని శాసిస్తుందా?

ఒక అందమైన కుటుంబ కథా చిత్రం లేదా ప్రేమకథా చిత్రం.. యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించడం వేరు. పూర్తిగా VFX ఆధారిత సినిమా ని తెరకెక్కించడం వేరు. పురాణేతిహాసాల్ని కథలుగా ఎంచుకున్నా చరిత్ర ను కథాంశంగా ఎంచుకున్నా ఫిక్షన్ జోడించాల్సిన పరిస్థితి ఉంటోంది కాబట్టి కచ్ఛితంగా విజువల్ గ్రాఫిక్స్- వీ.ఎఫ్.ఎక్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటోంది. రామాయణేతిహాసం ఆధారంగా రూపొందించిన ఆదిపురుష్ చిత్రానికి వీ.ఎఫ్.ఎక్స్ పని చాలా ఎక్కువ. అయితే ఓంరౌత్ ఈ విభాగం లో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలొచ్చాయి. ఎంపిక చేసుకున్న కథాంశం ఔచిత్యాన్ని దెబ్బ తీసాడన్న బ్యాడ్ నేమ్ వచ్చింది. ఫిక్షన్ హద్దు మీరడం రామాయణంతో సరిపోలని విజువల్స్- టెక్నికాలిటీస్ తో ఆదిపురుష్ ని తెరకెక్కించాడని భక్తులు సాంప్రదాయవాదులు తిట్టి పోసారు.

కారణం ఏదైనా కానీ భవిష్యత్ ని VFX ఆధారిత సినిమాలు శాసిస్తాయనడం లో సందేహం లేదు. అవెంజర్స్-అవతార్- స్పైడర్ మ్యాన్- థోర్- ఆక్వామేన్ సహా ప్రతిదీ వీఎఫ్ ఎక్స్ ఆధారిత సినిమాలు. వీటన్నిటి ప్రభావం భారతీయ యువత పై ప్రభావవంతంగా ఉంది. అందువల్ల లార్జర్ దేన్ లైఫ్ హీరో పాత్రలు ఫాంటసీ ఫిక్షన్ కంటెంట్ కి భారతీయ ఆరిజన్ లో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పోరాలో ప్రాధాన్యత పెరిగిందనడంలో సందేహం లేదు.

అందుకే మునుముందు VFX బేస్డ్ సినిమాలు పెరిగేందుకు ఛాన్సుంది. అయితే ఈ విభాగం లో ఎందరు తెలుగు దర్శకులకు పట్టుంది? అంటే.. రాజమౌళి పేరు ఒక్కటే బలంగా వినిపిస్తోంది. బాహుబలి-బాహుబలి 2- ఆర్.ఆర్.ఆర్- ఈగ లతో విజువల్ ఎఫెక్ట్స్ పనితనాన్ని ప్రభావవంతంగా ఉపయోగించగల సమర్థుడిగా రాజమౌళి నిరూపించాడు. ఒక హాలీవుడ్ దర్శకుడికి ఏమాత్రం తగ్గని పనితనం తన వద్ద ఉందని నిరూపించాడు.

సౌతిండియాలో చాలా కాలంగా VFX బేస్డ్ సినిమాలు తీయడంలో సత్తా చాటిన దర్శకుడు శంకర్. అతడి విజువల్స్ కి పేరు పెట్టడం అసాధ్యం. రోబో-2.0 సినిమాలు అందుకు పెద్ద ఉదాహరణలు. జయాపజయా లతో సంబంధం లేకుండా భారతీయ సినిమాని ఏల్తున్న మేటి దర్శకుడు శంకర్. అతడికి సాంకేతికత పై ఉన్న పట్టు అసాధారణమైనది. రాజమౌళి తరహాలోనే హాలీవుడ్ రేంజు సినిమాలు తీసే సత్తా అతడికి ఉంది.

ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా తో బాలీవుడ్ యువదర్శకుడు అయాన్ ముఖర్జీ నిరూపించాడు. కొన్ని విమర్శల్ని ఎదుర్కొన్నా కానీ ఫైనెస్ట్ విజువల్స్ ని క్రియేట్ చేశాడని అతడిని ప్రశంసించారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సహా యష్ రాజ్ బ్యానర్ లో భారీ చిత్రాల కు అతడు సంతకాలు చేసాడు. అలాగే టాలీవుడ్ లో క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా కోసం అద్భుత సాంకేతికత ను ఉపయోగించడం లో సక్సెసయ్యాడు. వీఎఫ్ ఎక్స్ -గ్రాఫిక్స్ తో పని చేసిన అనుభవం అతడికి ఉంది. హరిహరవీరమల్లు కోసం అతడు వీఎఫ్ ఎక్స్ ని భారీగా ఉపయోగిస్తున్నాడని సమాచారం.

సాంకేతికంగా గ్రాఫిక్స్-VFX  విభాగం లో ఉద్ధండులు కొందరు మాత్రమే. భారతీయ సినీపరిశ్రమ లో వీఎఫ్ ఎక్స్ తో పని చేసే సత్తా ఉన్న దర్శకుల సంఖ్య పెరగాల్సి ఉంది. అతికొద్ది మంది భారతీయ దర్శకులు అవసరం మేర తొలి నుంచి తమ సినిమాల్లో వీఎఫ్ ఎక్స్ పనితనాన్ని సమర్థంగా సద్వినియోగిం చేసుకుంటున్నారు. గ్రాఫిక్స్ ని వందశాతం సద్వినియోగం చేసుకోవడంలో మాస్టర్ మైండ్స్ గా పాపులరయ్యారు. విదేశీ సాంకేతిక నిపుణులతో పని చేయించుకునే అనుభవం మాత్రం రాజమౌళి- శంకర్ వంటి వారికే పాజిబుల్ అయింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ సైన్స్ ఫిక్షన్- ఫాంటసీ సినిమా తీస్తున్న నాగ్ అశ్విన్ వరల్డ్ క్లాస్ విజువల్స్ కోసం చేస్తున్న ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. అతడు విదేశీ సాంకేతిక నిపుణుల ను ఉపయోగించి టైమ్ ట్రావెల్ కథతో భారీ ప్రయోగం చేస్తున్నాడు.

సింగీతం వంటి ఉద్ధండుల సహకారం అతడికి ఉంది. అయితే వీఎఫ్ ఎక్స్ – గ్రాఫిక్స్ తో ఔట్ పుట్ తీసుకోవడంలో నాగ్ అశ్విన్ ఏమేర కు సక్సెసయ్యాడన్నది సినిమా చూశాకే తెలుస్తుంది. ఇక సుకుమార్ సాంకేతికాంశాల ను వేగంగా నేర్చుకోవడంలో ముందుంటాడు. పుష్ప కోసం స్మార్ట్ గా అవసరం మేర వీఎఫ్ ఎక్స్ సాంకేతిక అంశాల ను సద్వినియోగం చేసుకోవడంలో సఫలమయ్యాడు. పార్ట్ 2లోను వీఎఫ్ ఎక్స్ పనితరం సమర్థంగా వినియోగిస్తున్నాడని తెలిసింది. మునుముందు అతడి కథల ఎంపికలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు మరింత స్కోప్ పెంచుతాయని భావిస్తున్నారు.

ఇతర డైరెక్టర్లు ఈ లీగ్ లోకి వస్తారా? అంటే … ‘హనుమంతు’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నాడు.. అతడు అ! లాంటి చిన్న సినిమా లో అద్భుతమైన ఎఫెక్ట్స్ ని ఉపయోగించాడు. డైరెక్టర్ మారుతి బ్యాక్ గ్రౌండ్ యానిమేషన్ -వీఎఫ్ ఎక్స్ ఆధారితం కాబట్టి అతడికి ఆ విభాగంలో క్రియేటివిటీకి ఛాన్సుంది. అలాగే కథాంశాలతో ప్రయోగాలు చేసే నేటితరం దర్శకులు చందు మొండేటి- సుధీర్ వర్మ వంటి వారికి టెక్నికల్ గా దూసుకెళ్లే ఛాన్సుంది.

ఇకపోతే కొరటాల శివ- త్రివిక్రమ్- పూరి జగన్నాథ్- బోయపాటి లాంటి దర్శకులు వీఎఫ్ ఎక్స్ ని పరిమితంగా తమ సినిమాల్లో ఉపయోగించారు. వారు ఎంపిక చేసుకునే కథల కు తగ్గ పనితనం అది. భవిష్యత్ లో భారీ కాన్వాస్ ఉన్న కథాంశాల్ని ఎంచుకున్నప్పుడు టెక్నికాలిటీస్ తో సీనియర్ దర్శకులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించడం లో దేశం లోనే ఫైనెస్ట్ స్టార్ ఆల్ రౌండర్ కమల్ హాసన్. విశ్వరూపం-విశ్వరూపం 2తో అతడు నిరూపించాడు. అతడు లోకేష్ కనగరాజ్ తో భవిష్యత్ లో భారీ ప్రయోగాల కు శ్రీకారం చుడుతున్నాడు. విక్రమ్ మూవీ కోసం ఈ జోడీ ఉపయోగించిన సాంకేతికత-వీఎఫ్ ఎక్స్ అసాధారణమైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these