వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సేకరించిన వినతి పత్రాలతో ఏలూరు నియోజకవర్గం వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారు, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్ర గారు, పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ గారు, ఉంగుటూరు ఇన్చార్జి పుప్పాల వాసుబాబు గారు, చింతలపూడి ఇన్చార్జి కంభం విజయ రాజుగారు, పోలవరం ఇన్చార్జి తెల్లం బాలరాజు గారు, దెందులూరు ఇన్చార్జి అబ్బయ్య చౌదరి గారు, నూజివీడు ఇంచార్జి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు,కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు గారు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి గారు, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ గారు,రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.
