యూఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. మొదటి రోజు పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. శోభా గ్రూప్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, బుర్జీల్ హెల్త్ కేర్ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా, లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి చూపింది. దుగ్గరాజపట్నం నౌకా కేంద్రంలో పెట్టుబడులకు ట్రాన్స్‌వరల్డ్ ముందుకు వచ్చింది. తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జీల్ హెల్త్ కేర్ అంగీకారం తెలిపింది. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో ఐటీ పార్కులు, మాల్స్, హోటల్స్, గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి కనబరిచింది.
